చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో గాయాలయి చికిత్స పొందుతూ ఓ యువకుడి మృతి
చేవెళ్ల మండల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం 4:00 గంట సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవునిఎర్రపల్లి స్టేజ్ వద్ద ముడిమ్యాల గ్రామానికి చెందిన ఉపేందర్ వయసు 21 పెట్రోల్ పోయించుకునేందుకు తన స్నేహితుడితో కలిసి పెట్రోల్ పంపు కి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉపేందర్ కి గాయాలయ్యాయి. కాగా సోమవారం సాయంత్రం 4:00 గంటల సమయంలో చికిత్స పొందుతూ ఉపేందర్ మృతి చెందాడు.