దేశ శాంతి భద్రతల పరిరక్షణలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) కీలకమైన పాత్ర పోషిస్తున్నదని, సురక్షిత తీరం, తీర ప్రాంతాల పరిరక్షణతో పాటు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండర్ సంపత్ కుమార్ తెలిపారు. వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ – 2026 పేరిట చేపట్టిన ఈ సైకిల్ యాత్ర, తొమ్మిది రాష్ట్రాల్లో 6,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఈ ర్యాలీని జనవరి 28వ తేదీన కోల్కతా నుంచి ప్రారంభించి, కేరళ రాష్ట్రం కొచ్చి వరకు కొనసాగించి ఫిబ్రవరి 23వ తేదీన ముగించనున్నట్లు తెలిపా