అనంతపురం జిల్లా పామిడి మండలంలోని రామరాజుపల్లి శివారులో 44వ జాతీయ రహదారి పక్కన డాబా వద్ద నిలిపిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఓ గుర్తు తెలియని వ్యక్తి శివకుమార్ అనే వ్యక్తికి చెందిన రూ.10లక్షలు చోరీ చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన శివకుమార్ బిజినెస్ పనిపై రూ.10లక్షలు తీసుకొని హైదరాబాద్ నుంచి చెన్నై కు బస్సులో వెళ్తున్నాడు. అయితే పామిడి మండలంలో అర్ధరాత్రి బస్సు నిలపడంతో శివకుమార్ మూత్ర విసర్జనకు కిందకు దిగగా అతడి బ్యాగులో ఉన్న 10లక్షలు తొలుసుకొని ఉడాయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.