నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం కంపమల్ల మెట్ట కు సమీపంలో కృష్ణ జింక మృతి చెందింది, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందజేశారు, అటవీ శాఖ అధికారి డిఆర్ఓ మక్బూల్ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి కృష్ణజిక మృతి పై విచారణ చేపట్టారు, కృష్ణ జింక మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు