పత్తికొండ: తుగ్గలి లో కోడిపందాలు ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ నగదు కోళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం జొన్నగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని గుడిసె గుప్పెరల్ల గ్రామంలో కోడిపందేలు ఆడుతున్న ఆరుగురిని జొన్నగిరి ఎస్సై మల్లికార్జున అరెస్టు శుక్రవారం చేశారు. వారి వద్ద నుంచి రూ.2,100 నగదు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. మట్కా, పేకాట, కోడిపందేలు వంటి జూదాలు ఆడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు.