మంత్రాలయం: రచ్చుమరికి చెందిన వైసీపీ నాయకులు టిడిపి నాయకుడు రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ చేరిక
మంత్రాలయం : మండలం రచ్చుమరికి చెందిన వైసీపీ నాయకులు శుక్రవారం టీడీపీలో చేరారు. మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు మాంచాల సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి సమక్షంలో బోయ కోసిగి హనుమంతు, కోసిగి రోగప్ప, శివ, యాగంటి పాలప్ప తదితరులు టీడీపీలో చేరారు. వారికి రామకృష్ణారెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరామని వారు తెలిపారు.