చింతకాని: నగరంలోని ఖిల్లాను సందర్శించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, నాగేశ్వరరావు
ఖమ్మం నగరంలోని ఖిల్లాను సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి సందర్శించారు. ఖమ్మం ఖిల్లా అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని భట్టి పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, పర్యటక శాఖ అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.