దేవరకద్ర: దేవరకద్రలో కన్నుల పండువగా శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి ప్రభోత్సవం...
దేవరకద్ర మండల కేంద్రంలో వెలసిన శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారి ప్రభోత్సవం (తేరు) కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే సుచిగా స్నానమాచరించి దేవాలయం దగ్గరికి చేరుకొని మామిడి తోరణాలు,రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన స్వామి వారి తేరును దేవరకద్ర పట్టణ పురవీధులలో ఊరేగించారు.దీంతో దేవరకద్ర పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకొని పురవీధులు వీరప్పయ్య స్వామి నామస్మరణలతో మారుమూగాయి.ఈ వేడుకలో పట్టణవాసులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.