నంద్యాల పట్టణం టెక్కే మార్కెట్ యార్డులో సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో మొదటి, రెండు, మూడు బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేసినట్లు విశ్వహిందూ పరిషత్ నంద్యాల నగర అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.