పగి డ్యాల మండల పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం ముచ్చుమర్రి ఎస్సై నరేంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు పలు అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టి సోదాలు నిర్వహించారు, అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి 15వ తేదీ నుండి కాశిశ్వర నందీశ్వర స్వామి తిరుణాల ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు