వెలుగోడు పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బందిపై శుక్రవారం ఓ వ్యక్తి దౌర్జన్యానికి దిగాడు. ఇంటి పన్ను వసూలు చేయడానికి వెళ్లిన సిబ్బందిని బూతులు తిడుతూ అవమానించాడు. అయితే, నిందితుడిపై ఫిర్యాదు చేసినా.. ఓ స్థానిక నాయకుడి అండతో పోలీసులు అతన్ని వదిలేయడం వివాదానికి దారి తీసింది. దీంతో ఆగ్రహించిన సిబ్బంది పారిశుద్ధ్య పనులను నిలిపివేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే పంచాయతీ సేవలను పూర్తిగా స్థంభింపజేస్తామని పంచాయతీ సిబ్బంది హెచ్చరించారు.