డి.హిరేహాల్ మండలంలోని కళ్యం గ్రామ సమీపంలో రాయదుర్గం - బళ్ళారి రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో రాయదుర్గం మండలం పల్లేపల్లి గ్రామానికి చెందిన గొల్ల నగేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం సిఫార్సు చేశారు.