ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఏటీఎం కేంద్రాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలిపారు. ఇప్పటికే బ్యాంక్ అధికారులకు ఏటీఎం కేంద్రాల నిర్వహణపై కొన్ని సూచనలు ఇచ్చామని సీసీ కెమెరాల పర్యవేక్షణ భద్రత వంటి అంశాలపై దృష్టి సాధించాలని సూచించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఆ ప్రాంతాలలో అనుమానస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ప్రతిరోజు రాత్రి ఏటీఎం కేంద్రాలను పోలీసు సిబ్బందితో తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.