పాణ్యం: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : కార్మిక సంఘం నాయకులు సుధాకర్ అప్ప
స్థానిక కార్మిక–కర్షక భవన్లో లీలావతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు నాయకులు M. గోపాల్, కే. సుధాకరప్ప, అబ్దుల్ దేశాయ్, జి. ఏసు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు తక్కువ వేతనాలతో, పెరిగిన కూరగాయలు–ధాన్యాల ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థికి మెనూ ఛార్జీని 20 రూపాయలు పెంచాలని, కార్మికుల వేతనాన్ని రూ.3000 నుంచి రూ.6000కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.