సిద్దిపేట అర్బన్: జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతం: పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని,రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని, పెండింగ్ స్కాలర్షిప్స్ ,రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బందులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో పిడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐపిఎస్యు సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలు జూనియర్ కళాశాల బంద్ చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలల, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఒకరోజు ముందే విద్యార్థులకు సెలవును ప్రకటించాయి. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.య