నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్ సైట్ సృష్టించడం కలకలం రేపింది అజ్మన్ డాట్ కామ్ పేరిట ఫేక్ సైట్ ద్వారా భక్తుల నుంచి పానకం సేవ కోసం 151 వసూలు చేస్తున్నట్లు ఆలయం ఏవో రామానుజన్ తెలిపారు, శనివారం మన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి మోసపూరిత ప్రకటనలో భక్తులు నమ్మవద్దని సూచించారు, దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు