కుప్పం: కుప్పం మున్సిపల్ పరిధిలోని జగనన్న కాలనీలో చోరీ
కుప్పం మున్సిపాలిటీ అమరావతి కాలనీ సమీపంలోని జగనన్న కాలనీలో చోరీ జరిగింది. వేణు, నాగమ్మ ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. మట్టి పనులు చేసుకునే వేణు రెండు వారాల క్రితం బతుకుదెరువు కోసం తమిళనాడు రాష్ట్రం వాణియంబడి వెళ్లాడు. శనివారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి బీరువాలోని వస్తువులను చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.