రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ చైర్మన్ గా రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదెన్న పేరును సిఫార్సు చేస్తూ గవర్నర్ కు పంపారు. శనివారం రాత్రి గవర్నర్ ఆమోదం ముద్ర వేశారు. సుమారు 20 ఏళ్లపాటు TDP లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులుగా ఆదెన్న పనిచేశారు. అనంతపురంలో స్థిరపడ్డారు. రాజ్యాంగ బద్ద పదవి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.