ధర్మపురి: రాఘవపట్నంకు చెందిన చుక్కారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగా, BRS పార్టీ నుండి మంజూరైన చెక్కును అందజేసిన మాజీ మంత్రి ఈశ్వర్
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల రాఘవ పట్నం గ్రామానికి చెందిన ఏలేటి చుక్కా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి కార్యకర్త రోడ్డు ప్రమాదంలో స్వర్గస్తులు అయిన వెంటనే స్పందించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.. చుక్కరెడ్డికి సంబంధించిన FIR కాపీలు మరియు పోస్టుమార్టం రిపోర్టులను బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ విభాగానికి పంపడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుండి మంజూరైన 2లక్షల రూపాయల చెక్కును చుక్కరెడ్డి భార్య నవ్యకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటుందన్నారు