నగరి: కైలాసపురం సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
తిరుపతి చెన్నై జాతీయ రహదారి కైలాసపురం సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి నుంచి తిరుత్తణి వైపు ద్విచక్రవాహనంపై బయలుదేరిన దంపతులు ట్యాంకర్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో భార్యకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆమె కాళ్లు నుజ్జునుజ్జు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు.