కుప్పం: ఆసుపత్రి వైస్ ఛైర్పర్సన్ గా భాగ్యలక్ష్మి
కుప్పం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి నూతన కమిటీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. వైస్ ఛైర్పర్సన్గా భాగ్యలక్ష్మి త్రిలోక్ బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన త్రిలోక్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య భాగ్యలక్ష్మికి నామినేట్ పోస్ట్ ఇచ్చారు.