పేదరిక నిర్మూలన లక్ష్యంగా పిఫోర్ కార్యక్రమం :బనగానపల్లెలో పి ఫోర్ స్పెషల్ ఆఫీసర్ రఘురాం
స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం తొలి వార్షికోత్సవం సందర్భంగా బనగానపల్లె మండల పరిషత్ కార్యాలయంలో P4 కార్యక్రమాన్ని నిర్వహించారు. P4 స్పెషల్ ఆఫీసర్ రఘురామ్ మాట్లాడారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 6400 బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారికి మార్గదర్శకుల ద్వారా సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సేవలను గుర్తించి షాషావలి, బ్రాహ్మంకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు.