గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు ఆరిమాని గంగమ్మ ఆదాయం రూ. 1.18లక్షలు
ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు ఆరిమాని గంగమ్మ ఆలయంలో ఆదివారం హుండీ లెక్కింపు ఈవో వెంకట రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించామన్నారు. హుండీ ఆదాయం రూ.1,18,673 వచ్చిందని చెప్పారు.