ధర్మారం: చికిత్స పొందుతున్న పట్టణానికి చెందిన ఉమేష్ ను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
ధర్మపురి పట్టణంలోని తెనుగువాడకి చెందిన ఉమేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఉమేష్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.