ఆత్మకూరు RTC బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.సంక్రాంతి పండగ సెలవులు ముగియడంతో గమ్యస్థానాలకు వెళ్లేందుకు సరైన బస్సులు లేక గంటల తరబడి బస్టాండ్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.బస్సులు సకాలంలో రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వాహనాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచుతున్నారు. ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో సాధారణ ఛార్జీలకు రెట్టింపు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గమ్యం చేరాలంటే గత్యంతరం లేక భారీగా చెల్లించాల్సి వస్తోందని అన్నారు.