కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అండర్ 14 స్కూల్ గేమ్ ఫెడరేషన్ హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ ప్రారంభం
కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్రస్థాయి 69వ అండర్ 14 స్కూల్ గేమ్ ఫెడరేషన్ హ్యాండ్ బాల్ బాల బాలికల రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వైస్ ఎంపీపీ కలికిరి మాజీ సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ రెడ్డి సతీమణి రెడ్డి వారి గాయత్రి, ఎంఈఓ సురేష్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ ఎం వి.జి నటరాజన్, కలికిరి మండల పార్టీ అధ్యక్షులు కేఎస్ షాబుద్దీన్, విశ్రాంత ఎంఈఓ వై.ఆదినారాయణ, కొత్త మంచూరు జిడ్పీ హైస్కూల్ హెచ్ఎం వి.ప్రకాష్,హ్యాండ్ బాల్ స్టేట్ అబ్సర్వర్ వెంకటేశ్వరరావు, జిల్లా సెక్రటరీ ఝాన్సీ పాల్గొన్నారు