అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలోని సెంట్రల్ హాల్లో శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ పైలాన్ కు మంత్రి, ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 2000వ సంవత్సరంలో ప్రారంభమైన కళాశాల తొలి బ్యాచ్‌ను స్మరించుకుంటూ, గత 25 ఏళ్లుగా వైద్య విద్యా రంగంలో కళాశాల అందిస్తున్న సేవలను ప్రశంసించారు.