గ్రామాలలో మౌలిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది: గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర
స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర అన్నారు, శుక్రవారం అనకాపల్లి టిడిపి కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో మల్ల సురేంద్ర పాల్గొని ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు.