బాల్కొండ: రెంజర్ల సొసైటీలో రైతులకు అందుబాటులో యూరియా: మండల వ్యవసాయాధికారి సాయికృష్ణ
ముప్కల్ మండలంలోని రెంజర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఇప్పటివరకు 440 మెట్రో టన్నుల యూరియా మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వేంపల్లి పరిధిలో 200 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటివరకు సరఫరా చేయడం జరిగినది. ప్రస్తుతం రెంజర్ల సొసైటీ పరిధి నందు 40 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నది. ముప్కల్ మండల పరిధిలో ఎటువంటి యూరియా కొరత లేదు. యూరియా కావాల్సిన రైతులు రేంజర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి సాయికృష్ణ తెలిపారు