గంగాధర నెల్లూరు: ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్న ఘనత చంద్రబాబుదే: జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్
పాలసముద్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్ హాజరయ్యారు. ఇంటింటికీ తిరిగి పింఛన్ డబ్బులు అందజేశారు. ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్న ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు తాళ్లూరు శివ తదితరులు పాల్గొన్నారు.