నంద్యాల మండలం లో వైసీపీ ఎంపీటీసీ పై దాడి
Nandyal Urban, Nandyal | Dec 3, 2025
నంద్యాల మండలం ఎన్. కొత్తపల్లె గ్రామానికి చెందిన ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి బుధవారం పొలానికి వెళ్తుండగా కొందరు దాడి చేయడంతో గాయాలపాలయ్యారు. ఆయనకు పలుచోట్ల రక్త గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజకీయ కక్షతోనే తనపై దాడి జరిగిందని, పోలీసులు రక్షణ కల్పించాలని, దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.