గిద్దలూరు: గిద్దలూరు మండలం నరవ గ్రామ సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన కారు, డ్రైవర్ కి స్వల్ప గాయాలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం పై స్థానికుల ద్వారా సమాచారాన్ని అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జరిగిన ప్రమాదం పై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.