శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం, బయటపడుతున్న సప్త నదుల సంగమేశ్వరాలయం
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుతుండటంతో సప్తనదుల సంగమేశ్వరాలయం క్రమంగా బయటపడుతోంది.ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 862 అడుగులుగా ఉంది. సంగమేశ్వరాలయం పూర్తిగా బయటపడాలంటే నీటిమట్టం 837 అడుగులకు చేరాల్సి ఉంది. ఇంకా సుమారు 25 అడుగుల నీరు తగ్గాల్సి ఉంది.ప్రస్తుతం రోజుకు సుమారు ఒక అడుగు చొప్పున నీటిమట్టం తగ్గుతోంది.ఈ నేపథ్యంలో శ్రీ సంగమేశ్వర స్వామి ఉగాది ముందు లేదా తర్వాత భక్తులకు దర్శనం ఇచ్చే అవకాశముంది.గత సంవత్సరం జూన్ 15న కృష్ణా నదిలో పూర్తిగా జలాధివాసమైనసంగమేశ్వరాలయం, మళ్లీ భక్తులకు దర్శనం ఇవ్వబోతుండటం విశేషం.