పలమనేరు: మండల వ్యాప్తంగా ప్రస్తుతం చలికాలం సీజన్లో విపరీతమైన చలి మరియు మంచు కురుస్తున్న నేపథ్యంలో పట్టణంలో సోమవారం ఉదయం భారీగా మంచు కురిసింది. రోడ్డుపై వాహనంలో ప్రయాణిస్తుండగా ముందు వచ్చే వాహనం ఏమాత్రం కనిపించడం లేదు. వేగంగా వెళ్తే మాత్రం కచ్చితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి, కాబట్టి వాహనదారులందరూ కూడా మంచు కురిసేటప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రమాదాల బారిన పడకుండా ఉండాల్సిందిగా అధికారులు కోరారు.