ధర్మారం: బతికపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీవో మనోజ్ కుమార్
పెగడపల్లి మండలంలోని బతికపల్లి పిఎసిఎస్ వరి ధాన్య కొనుగోలు సెంటర్ ను పెగడపల్లి తాసిల్దార్ రవీందర్ నాయక్ ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ తో కలిసి జగిత్యాల డి సి ఓ మనోజ్ కుమార్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్ నిర్వాహకులకు వరి ధాన్యం తూకం వేగవంతం చేసి, త్వరలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీస వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ నాయకులు ముద్దుగంటి పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు