ఉగాది ఉత్సవాల నేపథ్యంలో,కర్ణాటక – మహారాష్ట్ర పాదయాత్ర భక్త బృందాలతో రెండవ విడత సమావేశం నిర్వహించిన అధికారులు
శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మార్చి 16 నుంచి 20 వరకు ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఉగాది పర్వదినం మార్చి 19న జరుగనుంది.ఈ ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై ఈరోజు పరిపాలనా భవనంలో రెండవ విడత సమన్వయ సమావేశం నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన పాదయాత్ర భక్త బృందాలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఇంతకుముందు ఫిబ్రవరి 25న కర్ణాటక రాష్ట్రంలోని తేర్దాళ్లో మొదటి సమన్వయ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ఈరోజు జరిగిన సమావేశంలో బాగల్కోట్, బెళగావి, బీజాపూర్ (విజయపుర), కోల్హాపూర్, షోలాపూర్, పాల్గొన్నారు