గుంతకల్లు: గుంతకల్లు రైల్వే స్టేషన్ లో 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై పైకప్పు పెచ్చులూడి పడడంతో తీవ్రంగా గాయపడిన బాలుడు మణికంఠ
గుంతకల్లు రైల్వే స్టేషన్ లోని 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై శుక్రవారం రైల్వే స్టేషన్ పైకప్పు పెచ్చులు ఊడి మణికంఠ అనే బాలుడిపై పడ్డాయి. ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు రైల్వే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు అధికారులు విచారణ చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న పైకప్పును మరమ్మతులు చేయించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.