రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో రాత్రి వేళ నిర్వహిస్తున్న కూరగాయల హోల్ సేల్ మార్కెట్ నిర్వాహణ అస్తవ్యస్తంగా మారింది. అటు స్థానికులు, ఇటు వాహనదారులకు సైతంతీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఆదివారం తెల్లవారుజామున ట్రిప్పర్, ఆటోలు ఎదురెదురు రావడంతో అరగంట పైగా ట్రాఫిక్ స్తంభించి బళ్ళారి రోడ్డులో ఎక్కడి వాహనదారులు అక్కడే ఆగిపోయాయి. అలాగే స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు మార్కెట్ కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, ఇళ్ల ముందు వ్యర్థాలను పడేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ నుంచి మార్కెట్ ను తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.