కొత్తకోట: పథకాలకు అర్హుల గుర్తింపు విషయమై గ్రామాలలో సందర్శించిన జిల్లా కలెక్టర్
పథకాలకు అర్హుల గుర్తింపు విషయమై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాల తహసిల్దార్ కార్యాలయాల్లో అధికారులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. అనంతరం పథకాలకు అర్హుల గుర్తింపు సర్వే ప్రక్రియ ఎలా జరుగుతుందో పరిశీలించేందుకు వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని రాయిని పేట, ఆత్మకూరు మండల పరిధిలోని మూల మల్ల, అమరచింత మున్సిపాలిటీ లోని 9వ వార్డ్ లలో సందర్శించి పథకాలకు అర్హుల గుర్తింపు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో అనే విషయాన్ని పరిశీలించారు.