పామూరు మండలంలోని పడమటి కట్ట కింద పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు కనిగిరి ఏఎంసీ చైర్మన్ యారవ రమా శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పామూరు మండలంలో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కృషి చేస్తున్నారన్నారు. మండలంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రభుత్వం నుండి నిధులను విడుదల చేయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.