నందికొట్కూరు కొత్తపల్లిలో ఘనంగా మట్టల ఆదివారం
నంద్యాల జిల్లా నందికొట్కూరు, కొత్తపల్లి లో మట్టల ఆదివారం ని సంఘస్తులు వైభవంగా నిర్వహించారు, నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఈత మట్టలను పట్టుకుని పరిశుద్ధ పౌలు ఆలయం చుట్టూ యేసు క్రీస్తు సంకీర్తనలు పాడుకుంటూ ర్యాలీ నిర్వహించారు, అలాగే కొత్తపల్లిలో కూడా ఏసుక్రీస్తు పాటలు పాడుకుంటూ ర్యాలీ నిర్వహించారు, ఏసుక్రీస్తు ప్రభువు జెరూసలేములోకి ప్రవేశానికి గుర్తుగా మట్టల ఆదివారాన్ని జరుపుకుంటామని రెవ అబ్రహం, ప్రేమ్ చందు, రెవ యోహన్ తెలిపారు, ఈ కార్యక్రమంలో సెక్రెటరీ అంబమ్మ, బ్యాంకు రవి చంద్రశేఖర్ సంఘస్తులు పాల్గొన్నారు, కొత్తపల్లిలో క్రైస్తవ సోదరులు మహిళలు సంఘస్తులు పాల్గొన్నారు