కొడంగల్: కోస్గి పట్టణ కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి: బీఆర్ఎస్ నాయకులు
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో సయ్యద్ పహాడ్ దర్గా నుండి రామాలయం వరకు కొనసాగిన రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు వెంకట నరసింహులు ఆధ్వర్యంలో బాధితులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండ్లు కూల్చుకొని నష్టపోయిన నిరుపేద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.