ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : అంబేద్కర్ స్ఫూర్తితోనే సివిల్స్ సాధించగలిగాను : రఘునాథ్ పల్లిలో కొయ్యడ ప్రణయ్ కుమార్
రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన కొయ్యడ ప్రణయ్ కుమార్ ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంక్ సాధించగా ఆయనను బుధవారం గ్రామస్తులు సాయంత్రం 5 గంటలకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో ఆలిండియా సివిల్స్ ర్యాంక్ ను సాధించినట్లు తెలిపారు. చిన్నప్పటినుండి పట్టుదలతో చదివి ఉన్నత స్థానం సాధించాలనే ధ్యేయంతో తల్లిదండ్రుల కోరిక మేరకు రెండో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించినట్లు తెలిపారు.పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే సివిల్స్ ను ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడితే ఫలితం తప్పకుండా లభిస్తుంది అన్నారు.