మార్కాపురం జిల్లా కంభం మరియు గిద్దలూరు పరిసర ప్రాంతాలలోని రైలు ట్రాక్ తో పాటు పలు రైల్వే స్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే అధికారి డివిజనల్ రీజినల్ మేనేజర్ సుదేశ్ నా సేన్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రయాణికుల సౌకర్యాలు మరియు భద్రత వంటి అంశాలపై ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. అలానే కంభం సమీపంలోని రైల్వే గేట్ వద్ద పరిస్థితులను పరిశీలించి వాహనదారుల ఇబ్బందులపై చర్చించారు. దక్షిణ మధ్య రైల్వే లో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.