భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ : మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా ఎటూరు నగరం నుంచి మొదలుకుంటే భూపాలపల్లి జిల్లా కాలువపల్లి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నల్లో ఇసుక మాఫియా కొనసాగుతుందని, కాల్వపల్లి ఇసుక క్వారీలో ఇంకా మూడు రీచ్ లను అదనంగా అడుగుతూ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టడం విడ్డూరంగా ఉందని వెంటనే ఇసుక మాఫియాను అడ్డుకొని ప్రభుత్వం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రెడ్డి.