నారాయణ్‌ఖేడ్: భీమ్రాలో పల్స్ పోలియో చుక్కల మందు వికటించి మూడేళ్ల బాలుడి మృతి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం భీమ్రా గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల మందు వికటించి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. పల్స్ పోలియో నివారణ చుక్కల మందు కోసం మూడేళ్ల బాలుడి తల్లిదండ్రులు స్వర్ణలత ఉమాకాంత్ ఆదివారం చుక్కల మందు వేయించారు. అనంతరం ఇంటికి వెళ్ళాక వాంతులు చేసుకొని కళ్ళు తెల్లగా చేసి, కాళ్లు చేతులు కొట్టుకొని మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు.