ప్రొద్దుటూరు: ప్రజల సమస్య పరిష్కారంలో మరో ముందడుగు కాంగ్రెస్ పార్టీ: ఇర్ఫాన్ భాష
Proddatur, YSR | Nov 19, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని 13వ వార్డు శ్రీరాముల పేటలో ప్రధాన కాలువకు వెళ్లే అప్రోచ్ కాలువలో వ్యర్థాలు సక్రమంగా తొలగించకపోవడంతో కాలువ దెబ్బతింది. దీంతో మురికినీరు రోడ్డుమీదికి చేరి వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిపోయిన మురికినీరు దుర్వాసనతో పాటు వాహనాలు జారిపడే ప్రమాదం కూడా పెరిగింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను బుధవారం మధ్యాహ్నం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ భాష వెంటనే స్పందించారు. గతంలో మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతంలో చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోవడం వల్లే సమస్య మళ్లీ తీవ్రరూపం దాల్చిందని ఆయన పేర్కొన్నారు.