మంత్రాలయం: మంత్రాలయం పట్టణంలో ఇళ్లను ప్రైవేట్ వసతి గృహాలు,హోమ్ స్టేలుగా నిర్మించే ప్రతి ఒక్క యజమాని తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి
మంత్రాలయం :పట్టణంలో ఇళ్లను ప్రైవేట్ వసతి గృహాలు, హోమ్ స్టేలుగా నిర్మించే ప్రతి ఒక్క యజమాని తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మంగళవారం హెచ్చరించారు. ఇంటి కోసం పంచాయతీ అనుమతి తీసుకుని వాణిజ్య భవనాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, సహకరించని భవనాలకు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలో పాటించాలని తెలిపారు.