యర్రగొండపాలెం: బద్వీడు చెర్లోపల్లి గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పశు గణాభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భకోశ వ్యాధులు నట్టల నివారణ బాగాలేని పశువులకు చికిత్స గాలికుంటు లంపి స్క్రీన్ వ్యాధుల నివారణకు టీకాలు వేయడం జరిగింది. కార్యక్రమంలో త్రిపురాంతకం సహాయ సంచాలకులు నరసింహారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పెద్దారవీడు పశువైద్యాధికారి డాక్టర్ నందన వైడిపాడు డాక్టర్ తదితరులు పాల్గొన్నారు.