నగరి: పుత్తూరు KKC లా కాలేజీలో కన్వీనర్ సీట్లు పొందిన విద్యార్థులకు కేటాయింపులో వివాదం
పుత్తూరు KKC లా కాలేజీలో కన్వీనర్ సీట్లు పొందిన విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. మేనేజ్మెంట్ కోటాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ మంగళవారం ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. చివరకు విద్యార్థుల సర్టిఫికెట్లు సమర్పించడంతో అందరికీ సీట్లు కేటాయించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, స్టూడెంట్స్ నాయకులు పాల్గొన్నారు.